Sachin Bansal: ఓలాలో తన వాటాను విక్రయించే ఆలోచనలో బన్సల్..! 1 d ago
ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్, తన స్టార్టప్ నవీ టెక్నాలజీస్‌ని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విస్తరణలో భాగంగా, ఆయన ఓలాలోని తన వాటాను ఉపసంహరించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీని గురించిన చర్చలు ప్రస్తుతం జరుగుతున్నట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. 2019లో బన్సల్ ఓలాలో 100 మిలియన్ల డాలర్ల (రూ.857 కోట్లు) పెట్టుబడి పెట్టగా, అది 4 బిలియన్ డాలర్లు (రూ.34,000కోట్లు)కి చేరుకున్నట్లు అంచనా వేయబడింది.